నేడు (24-04-2021)..గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా


గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు 10, 53, 51 వ డివిజన్ల లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటి చేస్తున్న తోట వెంకటేశ్వర్లు, ఎర్ర కావ్య, తౌటిరెడ్డి రవీందర్ రెడ్డి తరపున వరంగల్ అర్బన్ & రూరల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి గారు ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయిందని ఈ ఎన్నికల్లో టిఆరెస్ నాయకులకు ప్రజలు తగిన గుణపాటం చెప్పాలని అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి నోచుకోలేదని కాబట్టి కాంగ్రెస్ నాయకులూ కార్యకర్తలు ఐక్యంగా ఉండి 10, 51, 53 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తోట వెంకటేశ్వర్లు, ఎర్ర కావ్య, తౌటి రెడ్డి రవీందర్ రెడ్డిలను అత్యదిక మెజారిటితో గెలిపించుకోవాలని అన్నారు.

9 views