సమయ పాలన పాటించని మునిసిపల్ సిబ్బంది పై క్రమ శిక్షణా చర్యలు


సమయ పాలన పాటించని మునిసిపల్ సిబ్బంది పై క్రమ శిక్షణా చర్యలు*

*# మునిసిపల్ సిబ్బంది పట్టణ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలి*

*# మధ్యాహ్నం 3.30 గంటలకు మునిసిపల్ కార్యాలయమును ఆకస్మికంగా సందర్షించిన పుర చైర్మన్*

నల్లగొండ పురపాలక చైర్మన్ నేడు మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక , ఇంజనీరింగ్,MEPMA , పారిశుద్ధ్యం , రెవెన్యూ , జనన మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయు విభాగాలను ఆకస్మికంగా సందర్శించి సిబ్బంది పనితీరు పరిశీలించారు. హాజరైనట్లు రికార్డులో ఉండి విధులలో లేని సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనరును ఆదేశించారు. మున్సిపల్ సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఈ సందర్భంలో మునిసిపల్ కోఆప్షన్ నెంబర్ కొండూరు సత్యనారాయణ , మేనేజర్ కిరణ్ ఆలకుంట్ల మోహన్ బాబు తదితరులు ఉన్నారు.

38 views