ఈ రోజు (29.02.2020) నెల్లూరు లోని కొత్త ZP మీటింగ్ హాల్ నందు

ఈ రోజు (29.02.2020) నెల్లూరు లోని కొత్త ZP మీటింగ్ హాల్ నందు రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి శ్రీ P. అనిల్ కుమార్ యాదవ్ గారు మరియు పరిశ్రమలు, వాణిజ్యం, సమాచార సాంకేతికత, నైపుణ్య అభివృద్ధి మరియు శిక్షణ శాఖా మంత్రి శ్రీ M.గౌతమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశములో పాల్గొన్న మన ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ గారు. ఈ సమావేశంలో ప్రధానంగా మైనింగ్, హౌసింగ్, త్రాగు నీరు మరియు MGNREGS గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలోని సిలికాన్, డంపింగ్ యార్డులు మరియు వివిధ సమస్యల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.8 views