వికాస చిన్నారుల జన్మదినోత్సవ వేడుకలో మంత్రి హరీశ్ రావు గారు

Updated: Feb 29, 2020

సిద్ధిపేట, ఫిబ్రవరి 19: జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మార్కెట్ యార్డులో బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన

హాజరై కేక్ కట్ చేసి పిల్లలకు తినిపించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి మాట్లాడారు. - రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కామెంట్స్: - బాల వికాస సంస్థ గ్రామ గ్రామాన నీళ్లు అందిస్తుంది. - రైతులకు వర్షాకాలంలో నీరు పొడుపుగా వాడుకోవడం పొలం కుంటలు తీయడం, చేపలు పెంచడం బాల వికాస పని చేస్తున్నది. - ఆర్గానిక్ వ్యవసాయం ఏలా చేయాలో శిక్షణ ఇస్తున్నది. - అమ్మా, నాన్న లేని అనాథ పిల్లలను చేరదీసి వారి జన్మదినోత్సవ వేడుకలు జరిపించడం పట్ల బాల వికాస సంస్థ చేస్తున్న కృషి అభినందనీయం. - ఇవాళ బాల వికాస చేసిన జన్మదిన వేడుకలతో అనాథ పిల్లల్లో ఆత్మ విశ్వాసం, సంతోషాన్ని కలిగించిందని అందరూ అభినందిస్తున్నారు. - జీవితంలో డబ్బు సంపాదించవచ్చు. కానీ ప్రేమ, ఆప్యాయత లేకపోతే జీవితం కృతిమంగా ఉంటుందని, బాల వికాస ఇలాంటి సేవ చేయడం గొప్ప విషయం. - కష్టాల్లో ఉన్న వారికి సేవ చేయడం దేవుడికి సేవ చేయడమే అవుతుంది. - వితంతువులను దూరంగా ఉంచితే అసాంఘిక సంప్రదాయాలు ఇంకా కొనసాగుతాయి. బాల వికాస ఆధ్వర్యంలో ఏ శుభ కార్యం రోజునైనా వితంతువుల చేత ప్రారంభింప చేయిస్తున్నారు. - పాత అలవాట్లు, సంప్రదాయాలు మంచి కోసమే పాటించాలి., తప్ప చెడు కోసం కాదు.

4 views